Pages

Search

News

సూత్రధారుల ఖేల్‌ ఖతం

పుల్వామా దాడి కుట్రదారులు ఘాజీ, కమ్రాన్‌లను మట్టుబెట్టిన సైన్యం 
మరో ముష్కరుడూ హతం 
కశ్మీర్‌లో 16 గంటలు సాగిన భీకర ఎన్‌కౌంటర్‌ 
మేజర్‌ సహా నలుగురు సైనికుల వీరమరణం 
బ్రిగేడ్‌ కమాండర్‌, డీఐజీ సహా పలువురికి గాయాలు

శ్రీనగర్‌: జమ్మూకశ్మీర్‌లో భద్రతా దళాలు పెద్ద విజయాన్ని సాధించాయి. పుల్వామాలో సీఆర్పీఎఫ్‌ వాహనశ్రేణిపై దాడికి ప్రతీకారం తీర్చుకున్నాయి. ఆ దాడి సూత్రధారులు జైష్‌ ఎ మహ్మద్‌ కమాండర్లు అయిన అబ్దుల్‌ రషీద్‌ అలియాస్‌ ఘాజీ, కమ్రాన్‌తో పాటు మరో ఉగ్రవాదిని భారత సైన్యం మట్టుబెట్టింది. 16 గంటల పాటు హోరాహోరీగా సాగిన భీకర ఎన్‌కౌంటర్‌లో ఒక మేజర్‌ హోదా అధికారి సహా నలుగురు సైనికులు, ఒక పోలీసు వీరమరణం పొందారు. ఒక పౌరుడు కూడా చనిపోయాడు. గురువారం జైష్‌ ఎ మహ్మద్‌కు చెందిన ఒక ఆత్మాహుతి దళ సభ్యుడు సీఆర్పీఎఫ్‌ వాహన శ్రేణిపై దాడి చేసి 40 మంది జవాన్లను పొట్టనబెట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటన జరిగిన ప్రదేశానికి 12 కిలోమీటర్ల దూరంలోని పింగ్లాన్‌ ప్రాంతంలో తాజా ఎన్‌కౌంటర్‌ జరిగింది. ఉగ్రవాదుల కదలికలపై సమాచారం అందడంతో ఆదివారం అర్ధరాత్రి సైన్యంలోని 55 రాష్ట్రీయ రైఫిల్స్‌, సీఆర్పీఎఫ్‌, జమ్మూకశ్మీర్‌ పోలీసుకు చెందిన ప్రత్యేక కార్యాచరణ దళ (ఎస్‌వోజీ) జవాన్లు  ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి గాలింపు మొదలుపెట్టాయి. ప్రతి ఇంట్లో సోదాలు జరిపాయి. ఈ ప్రక్రియ సాగుతుండగానే సోమవారం తెల్లవారుజామున సైన్యంపై ఉగ్రవాదులు కాల్పులు మొదలుపెట్టారు. ఇందులో నలుగురు సైనికులు చనిపోయారు. దీంతో ఉగ్రవాదులు కాల్పులు మొదలుపెట్టిన ఇంటిపైనే భద్రతా దళాలు దృష్టిపెట్టాయి. జైష్‌ ఎ మహ్మద్‌ కమాండర్‌ కమ్రాన్‌తో పాటు మరో ఉగ్రవాది హిలాల్‌ను హతమార్చాయి.ఆపరేషన్‌ ముగిసిపోతోందనుకున్న దశలో ఆకస్మాత్తుగా ఘాజీ కాల్పులు మొదలుపెట్టాడు.

Leave a Comments


Latest Tweet

  • @someuser Haha, do you like it Bro?
  • Hi, Brito magazine news is out now in envalabs
  • Lorem ipsum dolor sit amet
  • No, I don’t RT @emma Do you want to hang out with my friends?