Pages

Search

News

అమరవీరుల కుటుంబాలకు ఇన్ఫోసిస్‌ భారీ విరాళం

ఒక్కొక్కరికి రూ. 10 లక్షల నగదు సాయం: పుల్వామా జిల్లాలో తీవ్రవాదుల దాడికి బలైన అమరవీరుల కుటుంబాలకు ఇన్ఫోసిస్‌ ఫౌండేషన్‌ విరాళాన్ని ప్రకటించింది. మృతి చెందిన ప్రతి ఒక్క యోధుని కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున 40మందికి ఈ ఆర్థిక సాయాన్ని అందిస్తామని ఫౌండేషన్‌ వ్యవస్థాపకురాలు సుధామూర్తి ప్రకటించారు. ఆదివారం ఆమె విరాళాల వివరాలను వెల్లడించారు. ‘బాధితులకు నగదు సాయం అందిస్తున్నట్లు ప్రకటించటం సమంజసం కాదు. ఎంత డబ్బు ఇచ్చినా మరణించిన వారిని తేలేం. యోధులంతా వీర మరణం పొందారు. ఈ సమయంలో నగదు ప్రస్తావన రాకూడదు. కానీ సాయం చేయాలనుకున్న వారిలో స్ఫూర్తిని నింపేందుకు, బాధితుల కుటుంబాలకు మేమున్నామని చెప్పేందుకే ఆర్థిక సాయం ప్రకటించాల్సి వస్తోంద’న్నారు. మరణించిన యోధుల కుటుంబాలకు కర్ణాటక ఐపీఎస్‌ సమాఖ్య కూడా విరాళాన్ని ప్రకటించింది. వారి ఒక్క రోజు వేతనాన్ని 40 మంది అమరుల కుటుంబాలకు అందజేస్తామని సమాఖ్య కార్యదర్శి సౌమేందు ఆదివారం ఇక్కడ ప్రకటించారు.

Leave a Comments


Latest Tweet

  • @someuser Haha, do you like it Bro?
  • Hi, Brito magazine news is out now in envalabs
  • Lorem ipsum dolor sit amet
  • No, I don’t RT @emma Do you want to hang out with my friends?